Reading Time: < 1 minute
Massive Cash Disappearance At Sbi Atms A Staggering %e2%82%b91 20 Crore Missing

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ఎస్‌ఆర్ నగర్ రూట్ పరిధిలో ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఫిల్ చేస్తున్న సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది. రూ. 1, 20,98,500 రూపాయల నగదు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసింది. ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలో అవకతవకలు జరిగినట్లు సీఎం ఎస్ గుర్తించినట్లు సమాచారం. సిబ్బంది చేతివాటమా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.