
హైదరాబాద్: ‘రణబాలి’ సినిమాలో విజయదేవర కొండ, రష్మిక జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ఈ దంపతులు తొలి సారి సెట్‌లో అడుగుపెట్టారు. సినిమా బృందం ఆ దంపతులకు ఘన స్వాగతం పలికిన అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా నీరవ్ షా గ్రాఫిక్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో 1854 నుంచి 1978 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తుండగా ఆయన భార్య జయమ్మగా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 ప్రేక్షకుల ముందుకు రానుంది.