మనీ ప్లాంట్ సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెంచుకుంటారు. అయితే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం వలన చాలా మంది సంపద పెరుగుతుందని భావిస్తారు. అందుకే మనీ ప్లాంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక కొంత మంది ఇంటి అందం, అలంకరణ కోసం ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు.
అయితే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. కానీ అది సరైన పద్ధతిలో పెరగడం, సరిగ్గా నాటినప్పుడే అది ప్రయోజనాలను ఇస్తుందంట. లేకపోతే అనేక సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
మనీ ప్లాంట్ ఎప్పుడూ తీగలా పారుతూ ఉంటుంది. ఎప్పుడూ అది పొడవుగా పైకి పారుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు అయతే మనీ ప్లాంట్ వేపుగా పెరుగుతుందో అప్పుడు అదృష్టం కలిసి రావడమే కాకుండా ఇంటిలో సంపద వృద్ధి చెందుతుంది అంటారు. కానీ కొన్ని సార్లు మనీ ప్లాంట్ తప్పుడు దిశలో పెరుగుతుంది.
ముఖ్యంగా తీ నేల వైపు వేలాడటం లాంటిది జరుగుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్ తీగ కిందకు వేలాడటం అస్సలే మంచిది కాదంట. ఇది అశుభకరంగా భావిస్తారు. ఇది ధన నష్టాన్ని, ఆర్థిక సమస్యలను సూచిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
అందువలన ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ నేలవైపు చూసేలా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. అంతే కాకుండా, మనీ ప్లాంట్ సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే అది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. అందువలన ఈ మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ, ఆగ్నేయ దిశలో మాత్రమే నాటాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు




