
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా తాజాగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పుడు క్రీడాభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలో ఆట కంటే.. గ్యాలరీలో సందడి చేసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, కోడలు సానియా ఛందోక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్యాలరీలో వదిన-మరదళ్లు సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సానియా లక్నో జెర్సీని ధరించగా, సారా మాత్రం సాధారణ దుస్తుల్లో ఉన్నారు. దాంతో సారా మద్దతు ఎవరికి? అని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అర్జున్ టెండూల్కర్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మినీ వేలానికి ముందే లక్నో అతడిని రూ.30 లక్షలకు ట్రేడ్ చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తూ అతనికి ఇప్పటివరకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల కూడా చోటు దక్కడం లేదు. అర్జున్ ప్రస్తుతం జట్టు సభ్యులకు నీళ్లు అందిస్తూ ‘వాటర్ బాయ్’గా సేవలందిస్తున్నాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘అర్జున్ నీళ్ల బాటిళ్లు మోయడం చూడటానికే వీరు వచ్చారా?’ అంటూ సారా టెండూల్కర్, సానియా ఛందోక్‌పై ఫాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
Also Read: Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం రోహిత్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
సానియా ఛందోక్ లక్నో జెర్సీ వేసుకోగా.. సారా టెండూల్కర్ జెర్సీ ధరించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. సారా తన తమ్ముడు అర్జున్ కోసం కాకుండా.. తన ప్రియుడి శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్ కెప్టెన్) కోసమే వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లక్నోలో అభిమానులు ‘మీ మద్దతు ఎవరికి?’ అని ప్రశ్నించగా.. సారా నవ్వుతూ సమాధానం దాటవేయడం డేటింగ్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. గత రెండేళ్లుగా సారా, గిల్ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కానీ విషయంపై ఇద్దరూ స్పందించలేదు. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా హాజరవ్వడం, ప్రైవేట్ ఈవెంట్స్‌లో సీక్రెట్‌గా కలుసుకోవడం డేటింగ్ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. మరోవైపు గత నెలలోనే అర్జున్ టెండూల్కర్, సానియా ఛందోక్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.