Reading Time: < 1 minute

ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Caption of Image.

కోడేరు, వెలుగు : పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ, పూర్తి అయిన ఓ ఇల్లును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు గొప్పలకు పోయి భారీగా అప్పులు చేసి ఇబ్బందులు పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన 60 గజాల పరిధిలోనే ఇల్లు నిర్మించుకొని సంతోషంగా ఉండాలని సూచించారు. అనంతరం తీగలపల్లి గ్రామంలో మరణించిన కె. మల్లికార్జునరెడ్డి మృదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, డిప్యూటీ సర్పంచ్ మిద్దె శ్రీను, నాయకులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.