Reading Time: 2 minutes

IPL 2026: బ్యాటింగ్లో సంజు, బౌలింగ్లో జేమీ ఓవర్టిన్ మెరుపులు.. ఢిల్లీపై CSK ఘన విజయం.. 

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి సంజూ శాంసన్ ప్రాణం పోశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ కీలక పోరులో శాంసన్ చెలరేగి ఆడి సీఎస్కే తరఫున తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న సంజూ, ఈ మ్యాచ్‌లో క్లాస్, మాస్ ఇన్నింగ్స్‌తో విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు శతకంతో సంజు శాంసన్, హాఫ్ సెంచరీతో ఆయూష్ మాత్రే అద్భుతంగా రాణించడంతోనే, సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది.  ఇక 213 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మంచి ప్రారంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పథుమ్ నిస్సంక మధ్య 61 పరుగుల భాగస్వామ్యాన్ని  ఖలీల్ అహ్మద్ బ్రేక్ చేశాడు. ఖలీల్ బౌలింగ్ (4.6)లో జేమీ ఓవర్టిన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన సమీర్ రిజ్వీ(6), అక్షర్ పటేల్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు. స్వల్ప స్కోర్లకే ఈ ఇద్దరు ప్లేయర్స్ మైదానం వీడారు

Also Read  :చెలరేగిన శ్రేయస్, ప్రియాంష్, ప్రభ్‌సిమ్రన్.. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ 

ఇక దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ పథుమ్ నిస్సంక (41)ని అన్షుల్ కాంబోజ్ అవుట్ చేశాడు. అనంతరం బ్యాటంగ్ కి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తుండగా.. 121 పరుగుల వద్ద మిల్లర్ ని జేమి ఓవర్టిన్ క్లిన్ బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆశుతోష్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో అన్షుల్ కాంబోజ్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెనుదిరిగాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన  ఆకిబ్ నబీ దార్ (4) ఇలా వచ్చి అలా పెవిలియన్ కి చేరుకున్నాడు. 

ఒకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటకీ, స్టబ్స్ మాత్రం గివప్ ఇవ్వకుండా పోరాటం కొనసాగించాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్ తో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, 19వ ఓవర్లో జేమి ఓవర్టిన్ బౌలింగ్ లో నూర్ అహ్మద్ కి క్యాచి ఇచ్చి పెవిలియన్ కి చేరిన తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతా ఓపెన్ చేసింది. ఇక చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 4 వికెట్లతో చెలరేగగా, అన్షుల్ కాంబోజ్ మూడు వికెట్లు తీసుకోగా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్‍జప్‌నీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. 

©️ VIL Media Pvt Ltd.