
శ్వాసకోస, గుండెపోటు వ్యాధులతో చికిత్స పొందుతూ మృతి
నేడు సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని సిఎం రేవంత్ సహా సినీ ప్రముఖుల
సంతాపం 20
రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు పద్మవిభూషణ్,
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం
ముంబై : వసంత వేళ మృధుమంద్ర స్వరా ల కోకిల ఇక సెలవంటూ వెళ్లిపోయింది. చ లనచిత్ర ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే తమ 92వ ఏట కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న ఆశాకు శనివా రం గుండెపోటు వచ్చింది. దీనితో కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ప్రఖ్యాత బ్రీ చ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిసే పు పరిస్థితి నిలకడగా ఉన్నా తరువాత విషమించింది. చికిత్స దశలో ఆదివారం ఉద యం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మీడియా కు వెలువరించిన ప్రకటనలో తెలిపారు. ఆశాభోంస్లే మరణంతో భారతీయ గానక ళా సౌరభం మరింతగా ఇగిరిపోయింది. ప్ర ముఖ గాయని లతా మంగేష్కర్ చిన్న సోద రి, ఆమె కు భిన్నమైన గాన స్వర రాగాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఆశా భోస్లే అ టు స రిగమల కువకువల సశాస్త్రియ గానాలాపనలో, ఇటు జనాన్ని ఊర్రూతలూగించే దశాబ్దాల పాటు దమ్మారో దమ్ అంటూ ప క్కన నిలుచుని పాడినట్లు ఉండే పాటలతోనే తన స్వర ఝురిని సృష్టించుకున్నారు. వ యోవృద్ధ సమస్యలతో పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆమె మరణించారని ఆసుపత్రి డాక్టర్ ప్రతీప్ సందాని మీడియాకు తెలిపారు.
ఆమె భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన తరువాత సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పెద్దక్క లతా మంగేష్కర్ కూడా తమ 92వ ఏటనే 2022 ఫిబ్రవరిలో కన్నుమూశారు. సంగీత ప్రవాహాలలో ఇరువురిది భిన్న సరళి. లత గంభీర గంగాప్రవాహ శైలిని సొంతం చేసుకుంటే, ఇందుకు భిన్నంగా ఆశా భోంస్లే గలగలల జలపాతం వరవడిని సృష్టించుకున్నారు. పలు జాతీయ ప్రాంతీయ పురస్కారాలు అనేకం ఆమెకు అందాయి. పద్మ విభూషణ్, దాదాసాహెబ్ పాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా విభూషణ్ వంటి అవార్డులతో ఆమె వాటికి వన్నె తెచ్చారు. ఆశా సీని ప్రస్థానం 1943లో మరాఠీ చిత్రం మజాబ్‌తో ఆరంభం అయింది. చలా చలా నవ్ చలా మొదటి పాట. భావానికి తగ్గట్లుగానే ఆమె తరువాతి పాటల క్రమం ముందుకు సాగింది. తరువాత 1948లో బాలీవుడ్ దర్శకులు హంసరాజ్ బహల్ పిలుపుతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అక్కడ మలుపు తిప్పారు. 1954లో బూట్‌పాలిష్ సినిమాలోని పాటలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఇక తిరుగులేకుండా సాగారు . హరేరామ్ హరేకృష్ణలో క్లబ్ డాన్స్ దమ్ మారో దమ్ తరాల నిత్యనూతన యువజోరు పాట అయింది.
చురాలియా హూ తుమ్నే జో దిల్‌కో పాటలోని విరుపులు ప్రేమికులకే సందేశాలు ఇచ్చాయి. తెలుగులో తక్కువే అయినా తళుక్కుమన్నవే తెలుగు సినిమాలలో కూడా ఆమె పాడారు. తక్కువ పాటలు పాడినా నిలిచి ఉన్నాయి. పాలు నీళ్లు సినిమాలో ఇది మౌనగీతం, సీతాకాలం ప్రేమకు , నాలో ఊహలకు ఐసాలకిడి వంటి పాటల తేనెలూరారు. సోదరి లతా మంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావును తొలుత పెళ్లిచేసుకున్న ఆశా తరువాత విడాకులు తీసుకుని ప్రముఖ సంగీత దర్శకులు ఆర్‌డి బర్మన్‌ను 1980లో పెళ్లాడారు. యన 1994లో మరణించారు. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలు, మనవడు మనవరాలు జీవితంగా గడిపారు. అరుదుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పాటలు పాడారు. తనపై ఎవరి ప్రభావం పడటానికి వీల్లేదని చెపుతూ గానంలో తన సొంత ప్రతిభనే ఆశగా శ్వాసగా ఎంచుకుని సాగారు. క్లాసికల్ నుంచి కాబ్రే పాటల వరకూ ఆమెదే ప్రత్యేక బాణీ అయింది. చివరికి లతా మంగేష్కర్‌ను కూడా గాన ప్రతిభలో మించిపోయారు. తన నానమ్మకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ చివరికి మరణానికి దారితీసిందని మనవరాలు జనాయ్ భోంస్లే తెలిపారు. సినిమా రంగంలో కవ్వింతల మహిళ స్వరం ఎవరిదంటే అది కేవలం ఆశాజీదే అనే పేరు తెచ్చుకున్నారు.
మీరాకు పాడినా, హెలెన్‌కు గళమిచ్చినా ఆమెకే చెల్లు
విషాద ప్రేమ కథల హీరోయిన్ మీరాకుమారికి ‘హమ్ ఇంతేజార్ కరేంగే ’పాటతో బాధపెట్టినా, తిరుగులేని నర్తకి హెలెన్ క్లబ్ డాన్స్ పియా తూ అబ్‌తో ఆజా పాడినా ఈ రెండింటి వైరుద్ధం ఎంతగా ఉన్నా, వీటికి ప్రాణం పోసింది ఆమెనే అయ్యారు. ఎనిమిది దశాబ్దాల పాటల తోటల ప్రస్థానంలో ఆమె పాటల చివుళ్లు 12000 వరకూ ఉన్నాయి. ఆశాభోంస్లేకు అభిమానులు, పౌరులు ఆమె స్థానిక నివాసం లోవర్ పారేల్‌లోని కాసా గ్రాండేలో తుది నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. తరువాత శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆశాజీ మరణంతో ఓ అసాధారణ సంగీత యాత్ర ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. భారతదేశ గుర్తింపుగా మారిన ఆమె సంగీత ముద్ర చెరిపివేయలేనిదని కితాబు ఇచ్చారు. ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించారు. సంగీత ఓనమాలను సోదరి లతా మాదిరిగానే తండ్రి దీననాథ్ మంగేష్కర్ నుంచి పొందారు. నలుగురు సోదరిలు లతా ఉషా , మీనా ఆశా వీరిలో ముగ్గురు గాయనీలు, మీనా ఒంక్కరే సంగీత దర్శకురాలు అయ్యారు. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆశా లతా గాయనిలు అయినా ఎవరికి వారుగా సొంత శైలితో సాగారు. ప్రముఖ సంగీత దర్శకులు ఏ ఆర్ రహమాన్ రంగీలా పాటకు ఆమె ప్రాణం పోశారని స్పందించారు. ఆమె తేజస్సు ఆమె పాటనే అని ఫోటోలు జతపర్చారు. ఆమె మరణం తనను కదలించివేసిందని గాయని ఉషా ఉతూప్ రోదించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,
మంత్రుల సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్ఞి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోస్లే మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా, వివిధ భాషలలో సాటిలేని బహుముఖ ప్రజ్ఞ, నైపుణ్యంతో భారతీయ సంగీతానికి ఆశా భోస్లే చేసిన అసాధారణమైన సేవ, తరతరాలకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వారసత్వాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా తెలిపారు. ఆమె మరణం దేశ సాంస్కృతిక, కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
ఆశా భోస్లే మృతి సంగీత లోకానికి తీరని లోటని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆశా భోస్లే ఎనిమిది దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది సంగీతాభిమానులను అలరించారని మంత్రి గుర్తు చేసుకున్నారు. శాస్త్రీయ సంగీతం నుంచి ఆధునిక పాప్ వరకు విభిన్న శైలుల్లో ఆమె అందించిన గానమాధుర్యం అజరామరమని కొనియాడారు. భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, లెజెండరీ గాయని ఆశా భోస్లే మరణం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం కేవలం సినీ రంగానికే కాకుండా, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు.
అభిమానుల హృదయాల్లో ఆమెది
చిరస్థాయి: కిషన్‌రెడ్డి
భారతదేశం గర్వించదగ్గ గాయని, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోస్లే ఇకలేరనే వార్త చాలా విచారకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వైవిధ్యభరితమైన గాత్రంతో శాస్త్రీయ సంగీతంతోపాటుగా, గజల్స్, పాప్ మ్యూజిక్‌లోనూ రాణించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను వారు గెలుచుకున్నారు.
సంగీత ప్రియులకు తీరని
లోటు: రాంచంద్రరావు
ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణ వార్త విని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ఈ యుగానికి మరపురాని గాయనిగా గుర్తింపు పొందారని కొనియాడారు. అక్క లతా మంగేష్కర్, అలాగే ప్రఖ్యాత గాయకులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్‌తో కలిసి ఆశా భోస్లే దాదాపు అరవై ఏళ్లకు పైగా హిందీ సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందారని కొనియాడారు.
సంగీత ప్రపంచం అపురూపమైన స్వరాన్ని కోల్పోయింది: కెటిఆర్
సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందని ప్రముఖ గాయని, పద్మవిభూషణ్ ఆశా భోస్లే మరణం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సుమారు ఎనిమిది దశాబ్దాలపాటు తన గాత్రంతో కోట్ల మందిని అలరించిన పద్మ విభూషణ్ ఆశా భోస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.