Reading Time: < 1 minute

యం గ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆదివారం మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. మే 8న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఒక వైపు సుమంత్ ప్రభాస్, మరో వైపు జగపతి బాబు.. మధ్యలో నిధి ప్రదీప్ నిల్చున్న రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రం ప్రేక్షకులను లవ్, ఫ్యామిలీ మోషన్స్‌తో కట్టిపడేసే అనుభూతిని అందించబోతోందని ఈ పోస్టర్ సూచిస్తోంది.