
కొందరు ఉద్యోగులు రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని, కీబోర్డ్‌ని నొక్కుతూ ఉంటారు. అలాంటివాళ్లకు చేతులు ముఖ్యంగా వేళ్లు, మణికట్టు భాగంలో బాగా నొప్పి వస్తుంటుంది. అప్పుడు ఈ మసాజర్‌లో కాసేపు చేయి పెడితే చాలు.. ఉపశమనం కలుగుతుంది. దీన్ని అర్బోలీఫ్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ హ్యాండ్ మసాజర్లలా కాకుండా, హీట్, కంప్రెషన్‌తో మసాజ్ చేస్తుంది. వేళ్లు, అరచేయి, మణికట్టు, ముంజేయిని కవర్ చేసేందుకు నాలుగు ప్రత్యేక ఎయిర్‌బ్యాగ్ జోన్‌లు ఉంటాయి. హీట్ థెరపీ మోడ్‌ని 3 లెవెల్స్‌లో 35, 40, 45 సెంటిగ్రేడ్లలో అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇందులో ప్రత్యేకంగా 6 మసాజ్ మోడ్స్, 6 ఇంటెన్సిటీలు, 2 వైబ్రేషన్ ఆప్షన్లు ఉంటాయి. నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికి ఉండే ఎల్‌ఈడీ టచ్ స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీంతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. నొప్పులు తగ్గి రిలాక్స్ అవుతారు. కార్పెల్ టన్నెల్, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లకు, రోజూ చేతిపై ఒత్తిడి పడే వాళ్లకు అంటే గంటల తరబడి మొబైల్ ఆపరేట్ చేసేవాళ్లకు, ఎక్కువగా వంటలు వండేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆఫీసులోనైనా, ట్రావెల్ చేస్తున్నప్పుడైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ధర రూ. 5,699