Reading Time: < 1 minute
Love Insurance Company Flop Will Anil Ravipudi Take A U Turn On Kriti

టాలీవుడ్‌లో ‘హిట్ మెషీన్’గా పేరుతెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి భారీ మల్టీస్టారర్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో ఉంటుందా? లేదా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

ఇటీవల జరిగిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ కృతి శెట్టిని ఉద్దేశించి  “నువ్వు నా సినిమాలో నటిస్తున్నావని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం” అంటూ కృతి ఎంపికను అధికారికంగా ధృవీకరించారు.  ఈ చిత్రంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ ఇద్దరూ హీరోలుగా నటిస్తుండగా నందమూరి కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వెంకటేష్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిజానికి కృతి శెట్టికి గత రెండేళ్లుగా తెలుగులో సరైన సక్సెస్ లేదు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తున్న తరుణంలో అనిల్ రావిపూడి ఆమెను తన సినిమాలో తీసుకోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ల విషయంలో దర్శకులు వెనకడుగు వేస్తుంటారు. కానీ అనిల్ మాత్రం కృతి ప్రతిభపై నమ్మకంతో ముందడుగు వేశారు. ఆమె తెలుగు మాట్లాడే తీరును నటనను అనిల్ ప్రశంసించడం విశేషం. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కృతి శెట్టికి ఈ మెగా ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఒక పెద్ద ‘బూస్ట్’ అని చెప్పవచ్చు.