Reading Time: 8 minutes

మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. విద్యా ఉద్యోగపరంగా మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఏ కార్యక్రమం మీరు ప్రారంభించిన దానిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. క్రయవిక్రయాలు లాబిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి. ఎంతోకాలంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చి సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పడిన ప్రేమకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు బంగారు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏదైనా ఒక మంగళవారం రాహు సాయంత్రం పూట రాహుకాల దీపం పెట్టండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించకపోవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్. అదేరా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతమార్తం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించవద్దు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఓం నమో నారాయణా వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఒక వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. మెడలో దక్షిణామూర్తి రూపు ధరించండి. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. కొద్దికాలం వేచి ఉండండి. ఈ రాజు వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు రాయల్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లాలనే భావనతో ఉంటారు అదేవిధంగా ప్రయత్నం చేస్తే ఫలితం కూడా దక్కుతుంది. మీ నీతి నిజాయితీలే మిమ్మల్ని రక్షిస్తాయి. ఏదైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు కాలానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళండి కచ్చితంగా మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. అదేవిధంగా రావలసిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. స్థిరస్తుల విలువ పెరగటం చక్కటి అవకాశాలు రావటం జరిగే అవకాశం లేకపోలేదు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడి ముందుకు వెళ్లాలి. పదిమంది బాగుండాలి పదిమందితో కలిసి మనం కూడా ముందుకు వెళ్లాలి అనే భావనతో ఉంటారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వారికి అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ కి కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు గ్రహించి మెలగాలి. అఘోర పాశుపత హోమం చేయించుకోండి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1 కలసవచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తులారాశి వారికి వారం చాలు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా బాగా కలిసి వస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కన్న కలలు నెరవేరుతాయి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకుంటారు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతారు. అదేవిధంగా శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎప్పుడో చేసిన సహాయానికి కొంతైనా రుణం తీర్చుకోవాలని ముందుకు వస్తారు. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సోదరుల మధ్య మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. వారి సహకారంతో మరింత ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలుచేస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఏదైనా సరే అందరితో సామరస్య భావంతో ఉండాలనే భావన నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. చదువు మీద శ్రద్ధ వహించి నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వ్యాపార రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజ ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరీ సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. ఎవరైనా శత్రువులు ఉంటే మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఇప్పుడు సరైన సమయం కాదు కాబట్టి కొంతకాలం ఆగి ప్రయత్నించండి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు ఏదైతే ఒక కోరిక ఉన్నదో అది ఈ వారం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి ముఖ్యంగా కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం ఎరుపువతులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మకర రాశి వారికి ఈ వారం చాలావరకు బాగుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కూడా చాలావరకు సానుకూల పడతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక కార్యక్రమాన్ని తల పెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్థాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం ప్రోత్సహిస్తుంది. వచ్చిన ఉద్యోగాన్ని కాదని వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ప్రస్తుతం ఉన్న సమయంలో సద్వినియోగపరుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా చిన్నచిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా చేసే చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ తర్వాత లాభాలు వచ్చే విధంగా కూడా ఉంది. ఎంత లాభం వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్పులకి దూరంగా ఉండటం క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం చెప్పదగిన విషయం. ఏదైతే మీరు సంకల్ప సిద్దితో ఒక మంచి కార్యక్రమం తలపెడుతున్నారు అది నెరవేరుతుంది. అన్నదాన సత్రాలకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటున్నారో దాని కోసం కొంతకాలం ఆగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం, దుర్గాదేవి స్తోత్రం చదవటం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం చాలావరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసివచ్చే రంగు ఎల్లో, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా బయట పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు లేదా విదేశీ సంస్థల్లో ఉద్యోగం రావటం కావచ్చు జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాస్త సమయం పడుతుంది ఇప్పటినుంచి ప్రయత్నిస్తే సంవత్సరం చివరిలో వెళ్లే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ పని ప్రారంభించిన దిగ్విజయంగా పూర్తి అవుతుంది. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు వారాలు కాస్త చికాకు పెడతాయి. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండటం అలాగే ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయాలలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రథమార్తం కంటే ద్వితియార్థం చక్కగా ఉంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంత ధర నష్టం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం మంగళవారం శనివారం ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహ స్థితులపరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. ఎప్పుడో కొన్న స్థిరస్తుల విలువలు పెరుగుతాయి. మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే వారు చాలావరకు ఉంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అలాంటివేమీ జరగకుండా ఉంటాయి. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. పదిమందికి ఆమోదపూర్వకంగా ఉంటుంది. అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళతారు ఈ ఆలోచనలే పదిమందికి నచ్చుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ పదవీ కోసం ఎదురుచూసే వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. ప్రజలలో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఒక పదవి రాకపోవటం అనేది నిరాశకు గురి చేస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చక్కటి అవకాశం. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏదైనా ఒక పనిమీద నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోండి. మీరు ఆలోచించి తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే సఫలీకృతం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు గాని దైవదర్శనాలు గాని చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మన సంకల్పం బాగుండాలి పదిమంది బాగుండాలి అని ఆలోచనతో ముందుకు వెళతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలావరకు అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విష వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విష వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అప్పులు చేయటానికి దూరంగా ఉండటం క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఆలస్యంగా చేతికి అందుతాయి కావున ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే మీరు మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలి. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. లాభాల రూపంలో కావచ్చు పేరు ప్రఖ్యాతలు రూపంలో కావచ్చు కచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువు పట్ల ఇంకా అధిక శ్రద్ధ వహించాలి. చెడు వ్యసనాలకు సోషల్ మీడియాకు స్నేహితులకు దూరంగా ఉండాలి. ఇతరులకు అంతరంగ విషయాలు చెప్పడం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి మీరు కోరుకునే ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా వైద్యవృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మద్యస్థ ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన పెట్టుబడులు పెట్టి మోసపోకండి. ఖర్చులో విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం చెప్పుదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, దుర్గా స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.