బ్యాంకుల కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. వరుస సెలవులు రావడంతో వచ్చే వారంలో బ్యాంకులు తక్కువ రోజులే పనిచేయనున్నాయి. అంబేడ్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, పోహేలా బోయిషాఖ్ పండులు రావడంతో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.
వివిధ రాష్ట్రాల్లో పండుగల కారణంగా ఏప్రిల్ 13 నుంచి 19 వరకు నాలుగు రోజు పాటు బ్యాంకులు క్లో్జ్ కానున్నాయి. ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతి రావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.ఇక ఏప్రిల్ 15న బుధవారం పోహెలా బోయిషాఖ్, బోహగ్ బిహు, విషు సందర్బంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.
ఇక ఏప్రిల్ 16న ఇటానగర్, కొచ్చి, కోల్ కత్తా, తిరువనంతపురంలో బోహాగ్ బిహు సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఏప్రిల్ 19న ఆదివారం సందర్బంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే బ్యాంకులు మూతపడ్డా ఆన్ లైన్ డిజిటల్, ఏటీఎం, యూపీఐ సేవలు కొనసాగుతాయి. కేవలం బ్రాంచ్ కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి.
చెక్కు సర్వీసులు మాత్రం సెలవు రోజుల్లో ఆగిపోతాయి. చెక్కును నగదుగా మార్చుకోవడం, మేనేజర్‌ను కలవడం వంటి సేవలు ఉండవు. ప్రాంతాన్ని బట్టి బ్యాంక్ సెలవుల్లో మార్పులు ఉంటాయి. దీంతో మీరు బ్రాంచ్‌కు వెళ్లేటప్పుడు ఒకసారి ముందుగానే సిబ్బందికి కాల్ చేసి తెలుసుకోవడం మంచిది.
అయితే ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు అమలవుతాయి. ప్రాంతీయ పండుగలను బట్టి రాష్ట్రాల వారీగా ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకటిస్తూ ఉంటుంది. మధ్యలో సెలవుల జాబితాలో మార్పులు కూడా చేస్తూ ఉంటుంది. ఇక బ్యాంకులు ప్రతీ నెలలో రెండు, నాల్గొవ శనివారం మూసి ఉంటాయి.




