Reading Time: < 1 minute

లక్ష్మీదేవిపల్లి మండలంలోని నలంద స్టూడెంట్స్ అద్భుత విజయాలు

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలంలోని నలంద జూనియర్​ కాలేజీ స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధించారని కాలేజీ చైర్మన్ ఎం.వెంకట చౌదరి, సీఈవో చైతన్య కృష్ణ, ప్రిన్సిపల్​ మల్లికార్జునరావు పేర్కొన్నారు. జూనియర్​ఎంపీసీలో పి.చరణ్ 469, ఉజ్వల్ అభినవ్ సాయి 468, హారిక, భరణి, పి.హర్షిని, జస్వంత్​ రోజ్ 467 మార్కులతో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారన్నారు. 

30 మంది స్టూడెంట్స్ 460కిపైగా మార్కులు సాధించారన్నారు. జూనియర్​ బీపీసీలో లక్ష్మీ మౌనిక 436, కె.రేఖశ్రీ 435 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో 493 మార్కులు ఊర్మిళ సాధించిందన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి.వినీలా 990, బీపీసీలో మైత్రి 986 మార్కులు సాధించినట్టు తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.