Reading Time: 2 minutes

నిబంధనలు సడలించాలంట్ను యూనియన్ నాయకులు

మన తెలంగాణ,సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల కొనుగోళ్ళకు ఎన్ని రాయితీలు ప్రకటిస్తున్నా వాటి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఇతర వావాహనాలు కొనుగోళ్ళు ఎలా ఉన్నా ప్రవేట్ ట్రాన్స్‌పోర్టులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రయాణికులకు ఆర్‌టిసితో సమానంగా సేవలు అందిస్తున్న ఆటోలకొనుగోళ్ళు ఇతర వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి.డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరలు పెరుగుతుండటంతో విద్యుత్ కోనుగోళ్ళు అధికం అవుతాయని, ముఖ్యంగా ఆటో కొనుగోళ్ళ అధికంగా ఉంటాయని భావించిగా ఇతర వాహనాల కోనుగోళ్ళకంటే విద్యుత్ ఆటోలు కొనుగోళ్ళుమాత్రమే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఉపాధి కోసం ఆటోలను కొనుగోలు చేయాలంటే తప్పకుండా పర్మిట్ ఉండాల్సిందే. కేవలం పర్మిట్‌కోసమే సుమారు రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది.

వాస్తవానికి ఆటో ఖరీదు సుమారు రూ ః 2 లక్షల 20 వేలకు మించి లేదు. కానీ వీటిని బ్లాక్ మార్కెట్‌లో రూ సుమారు మూడు లక్షలకు విక్రయిస్తున్నారు. అదే విద్యుత్ ఆటోలు కోనుగోలు చేయాలంటే ముందుగా షోరూమ్ నిర్వాహకులకు ఆధార్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్‌లు, రెండు ఫోటోలతో అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఆయా ప్రాంతానికి చెందిన రవాణాశాఖకు పంపిస్తారు. దరఖాస్తుదారునికి ముందుగామరో అటోలేక పోతే విద్యుత్ ఆటోల కొనుగోళ్ళకు అనుమతి ఇస్తారు. వాస్తవానికి ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఎన్ని కొనుగోలు చేసిన అనుమతించే పాలకులు ఆటోల కొనుగోళ్ళను ఎందుకు నియంత్రిస్తున్నారో ఆర్దం కావడం లేదని ఆటో యూని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.

నగరంలో పాత ఆటో డ్రైవర్లు పేరున ఆటో ఉన్నప్పటికి అవి ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ వద్దనే ఉంటుంది.దీంతో సదరు డ్రైవర్ ఆటోకోనుగోలుకు అవకాశం లేకుండా పోతోంది. ఇటువంటి నిబంధన కారణంగా ఆటో డ్రైవర్లు వాటి కోనుగోళ్ళకు వెనుకాడుతున్నారు. ట్రాన్స్‌పోర్టుకు ఉపయోగించే విద్యుత్ ఆటోల కొనుగోళ్ళకు ఎటువంటి నిబంధనలు విధించకుండా నేరుగా షోరూమ్‌కు వెళ్ళగానే సాధారణ వాహనాల మాదిరిగా విద్యుత్ ఆటోల కోనుగోళ్ళకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ ఆటోలకు అనుమతిస్తే గ్రేటర్‌లో వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా ఆటోల బ్లాక్ పర్మిట్ల దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ ఆటోలతో ఉపాధి అవకాశాలు ఎక్కువ ః విద్యుత్ ఆటోలను కోనుగోలు చేయడం ద్వారా ఆటో డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా వారికి మెరుగైన జీవనోపాధి కలిగించినట్లు అవుతుందని ఆటోయూనియన్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆటోలను ఒక్క సారి చార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలో మీటర్ల వరకు నడుస్తాయన్నారు. అదే గ్యాస్ ఆటోలు రూ.80లతో 30 కిలో మీటర్లు మాత్రమే నడుస్తాయనింటున్నారు.ఇక ధర విషయానికి వస్తే విద్యుత్ ఆటోకు రూ. 3 లక్షలు అవుతుందని దీనికి పర్మిట్ అవసరం లేకపోవడంతో పర్మిట్‌కు పెడుతున్న ఖర్చుకే విద్యుత్ ఆటో కొనుగోలు చేయవచ్చంటున్నారు.

విద్యుత్ ఆటో కొనుగోళ్ళపై ఉన్న నిబంధన వెంటనే ఎత్తివేస్తే ఎంతోమంది ఆటో కార్మికులకు జీవనోపాది కలిగించినట్లు అవుతుందంటున్నారు. రెండో వాహనం కొంటే అదనపు ట్యాక్స్‌ను రద్దు చేసిన విధాంగానే ఆటో కొనుగోళ్ళకు పర్మిట్ విధానాన్ని ఎత్తివేయాలని పలువురు ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తూన్నారు. ఆటో పర్మిట్ విధానంతో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, తద్వారా షోరూం నిర్వహకులకు ప్రయోజనం చేకూరుతుందనేకాని సాధారణ ఆటో డ్రైవర్లకు ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. అంతే కాకుండా ఆటో పర్మిట్ విధానం ఎత్తివేయడంతో విద్యుత్ వాహనాలు కోనుగోళ్ళు పెరగడమే కాకుండా రవాణాశాకు ట్యాక్స్ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు