Reading Time: < 1 minute

‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మిగా కయాదు లోహర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Caption of Image.

తెలుగు, తమిళ, మలయాళ  భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ  క్రేజీ  హీరోయిన్‌‌గా పేరు తెచ్చుకుంది కయాదు లోహర్. శనివారం ఆమె పుట్టినరోజు.  ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల్లో ఒకటైన  ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి ఫస్ట్‌‌లుక్ పోస్టర్‌‌‌‌తోపాటు తన క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేశారు.  ‘‘వెండితెరపై వెలగని తార  మా  ‘సుబ్బలక్ష్మి’ని చూడండి” అంటూ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్‌‌గా సాగుతున్నప్పటికీ,  ప్యారడైజ్  ప్రపంచంలోకి  అడుగుపెట్టిన సుబ్బు పాత్ర కథకు సాప్ట్ టచ్ ఇచ్చేలా  ఉంటుందని మేకర్స్ చెప్పారు.

ఇందులో జడల్ పాత్రలో నాని డిఫరెంట్ గెటప్‌‌లో కనిపించనుండగా, కయాదు క్యారెక్టర్ ఇంటరెస్టింగ్‌‌గా ఉండనుందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈచిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రల్లో  కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతోంది.   ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది.  

©️ VIL Media Pvt Ltd.