Reading Time: < 1 minute

ఈ ఎండాకాలం నైట్ టెంపరేచర్లు హైదరాబాద్లోనే ఎక్కువ.. ఎందుకు ఈ పరిస్థితి అంటే..

Caption of Image.

పగటి ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా నమోదైతే.. రాత్రి టెంపరేచర్లు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్​ సిటీలోనే హయ్యెస్ట్ రికార్డ్ అయ్యింది. హైదరాబాద్ సిటీలోని వెస్ట్​మారేడుపల్లిలో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం నైట్​ టెంపరేచర్లు 20 డిగ్రీలలోపే రికార్డ్​అవుతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 17 డిగ్రీలు రికార్డయింది. ఆదిలాబాద్​ జిల్లాలో 18.4 డిగ్రీలుగా నమోదైంది. కాగా, వచ్చే రెండు వారాల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని ఐఎండీ వార్నింగ్​ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది. 

వర్షాలు తక్కువే.. 
రాష్ట్రంలో వర్షాకాలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులే ఉండబోతున్నాయి. స్కైమెట్​తో పాటు తెలంగాణ వెదర్​ మ్యాన్​ మాన్​సూన్​ ఫోర్​కాస్ట్​లో ఈ విషయం వెల్లడైంది. ఎల్​నినో అత్యంత తీవ్రంగా ఉంటుందని, హిందూ మహాసముద్రంలోనూ అదే పరిస్థితి ఉండబోతున్నదని ఫోర్​కాస్ట్​లో పేర్కొన్నారు. సాధారణం లేదంటే అంతకన్నా తక్కువ వర్షపాతమే ఈ సారి నమోదవుతాయని, 2018 నాటి పరిస్థితులే ఈ వర్షాకాలంలో ఉంటాయని తెలుస్తున్నది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలంగాణ వెదర్​ మ్యాన్​ హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.