
ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఆనందంలో మునిగి తేలుతున్న వేళ.. ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఉట్నూర్ మండలం దంతనపల్లికి చెందిన జిల్లపెల్లి సౌజన్య (17 ) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
జిల్లపెల్లి సౌజన్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కూతురు చనిపోవడంతో దల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఫెయిల్ అయితే మళ్లీ రాసేదానివి.. ఎందుకింత పని చేశావమ్మా.. అంటూ బోరున విలపిస్తున్నారు.