Reading Time: < 1 minute

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్‌ప్లాజాలలో వసూళ్లు ఇకపై కేవలం డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. శనివారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఆన్‌లైన్ చెల్లింపులలో షాస్టాగ్ లేదా యుపిఐ ప్రక్రియలతోనే చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. టోల్ కలెక్షన్లలో సమర్థత, పారదర్శకత కోసం ఈ చర్యను గణనీయ రీతిలో తీసుకువచ్చారు.

అయితే టోల్‌గేట్ వసూళ్లలో మార్పును అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఇప్పుడు వర్తింపచేయడం లేదని ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపుల పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సిందే అని , లేకపోతే ఇబ్బందులు తప్పవని జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఎన్‌హెచ్‌ఎఐ తెలిపింది. ఈ నెల 10వ తేదీనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.