
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ కీలక మలుపు తిరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు రానుంది. ఈ మ్యాచులో భారీ స్కోర్ చేసి గుజరాత్ జట్టుని ఒత్తిడిలోకి నెట్టాలని ఎల్ఎస్జీ చూస్తుంది. లక్నో బ్యాటర్లని తక్కువ పరుగులకే పెవిలియన్ కి పంపించాలని గుజరాత్ యత్నిస్తుంది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో సాధించిన విజయం తమ జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపాడు. ఈ మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లకుండా, అంతకంటే ముందే ముగించాలని చూస్తున్నాం.. మంచి క్రికెట్ ఆడటమే మా ప్రాధాన్యత.. ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీల్లో నిలకడ (Consistency) చాలా ముఖ్యం.. 14 మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు అయితే అత్యంత స్థిరంగా రాణిస్తుందో, ఆ జట్టే టోర్నీ గెలుస్తుంది.. గుజరాత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా అదే పాత టీంతో బరిలోకి దిగుతోందని గిల్ వెల్లడించారు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ప్రస్తుత వికెట్ల తీరును బట్టి చూస్తే మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా పెద్దగా తేడా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత మ్యాచ్‌లో మేము గెలిచిన తీరు జట్టు యొక్క పట్టుదలను చూపించింది.. ప్రతి విజయం మాకు ముఖ్యమే, కానీ మేము గతాన్ని వదిలేసి తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం.. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసేటప్పుడు మా ఆటగాళ్లు చూపించిన తెగువ అద్భుతం.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈరోజు బరిలోకి దిగుతున్నట్లు పంత్ తెలిపారు.
►ALSO READ | క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో వైశాలి విజయం
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ
🚨 Toss update from Lucknow 🚨@gujarat_titans have won the toss and elected to field first against @LucknowIPL
Updates ▶️ https://t.co/kIuuJYbiNx#TATAIPL | #KhelBindaas | #LSGvGT pic.twitter.com/i8hYbR18TX
— IndianPremierLeague (@IPL) April 12, 2026