
Tim David : ముంబైపై జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 16 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ముగిసిన తర్వాత ఒక వింత ఘటన చోటుచేసుకుంది. బంతి ఆకారం మారిపోయిందని టిమ్ డేవిడ్ వాదించడం మొదలుపెట్టారు. అంపైర్ బంతిని ఇవ్వమని అడుగుతున్నా, ఆయన వినకుండా దాన్ని తనిఖీ చేస్తూ కూర్చున్నారు. అంపైర్ పదేపదే వారించినా డేవిడ్ బంతిని ఇవ్వడానికి నిరాకరించడం గ్రౌండ్‌లో కాసేపు ఉత్కంఠ రేపింది.
నిబంధనల ఉల్లంఘన
క్రికెట్ నియమావళి ప్రకారం.. బంతి ఆకారం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసే అధికారం కేవలం అంపైర్లకు మాత్రమే ఉంటుంది. ఆటగాళ్లు దానిపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చ కానీ, అంపైర్ నిర్ణయాన్ని కాదని బంతిని తమ దగ్గరే ఉంచుకోవడం నిబంధనలకు విరుద్ధం. టిమ్ డేవిడ్ చేసిన ఈ పని వల్ల మ్యాచ్ కాసేపు ఆగింది. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెక్షన్ 2.10.7 (సమయాన్ని వృధా చేయడం) కిందకు వస్తుంది. అంపైర్లు దీనిపై సీరియస్ అయ్యారు. టిమ్ డేవిడ్‌ను మైదానంలోనే మందలించారు.
భారీ జరిమానా తప్పదా?
అంపైర్లు టిమ్ డేవిడ్ ప్రవర్తనపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ రిఫరీ దీనిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తే, టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఆటగాడు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంపై క్రికెట్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అంపైర్లతో గొడవ పడటం వల్ల జట్టు క్రమశిక్షణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Casual inspection from Tim David after absolute destruction
#IPLRivalryWeek 2026
#MIvRCB | LIVE NOW
https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
ఆర్‌సీబీ విజయం.. డేవిడ్ విధ్వంసం
ఈ గొడవ పక్కన పెడితే, మ్యాచ్‌లో మాత్రం బెంగళూరు సత్తా చాటింది. ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. టిమ్ డేవిడ్ 212 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. కానీ ఈ క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఆయనకు లభించిన ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆయనను హెచ్చరించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

