కావాల్సిన పదార్థాలు : జొన్న రవ్వలే దా జొన్న పిండి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కొద్దిగ పూదీన, నీరు.
తయారీ విధానం : స్టవ్ ఆన్ చేయాలి దానిపై పాత్ర పెట్టి అందులో మూడు కప్పుల నీళ్లు పోయాలి. నీరు బాగా మరిగేలా చూసుకోవాలి. ఇక నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న జొన్న రవ్వను వేసి బాగా కలపాలి.
జొన్న రవ్వ ఉండలు చుట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ సమయంలో మంట లో ఫ్లేమ్‌లో ఉండాలి. రవ్వ బాగా ఉడికితే గంజిలా తయారు అవుతుంది. దీనిని బాగా చిక్కగా కాకుండా పలచగా అయ్యేలా ఉడకబెట్టుకోవాలి.
గంజి బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, పూదీన తురుము వేయాలి. వీటన్నింటినీ వేసి మంచిగా కలుపుకోవాలి.
తర్వాత దీనిని ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత తాగాలి అంతే చల్ల చల్లని జొన్న రవ్వ గంజి రెడీ. దీనిని ఫ్రిజ్‌లో కాకుండా నార్మల్‌గా కూడా తాగవచ్చు. దీనిని రోజూ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.




