
ఢిల్లీ: మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అభివృద్ధి ప్రయాణంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మోడీ ప్రసంగించారు. 21 వ శతాబ్ధంతో ఇది కీలక నిర్ణయమని, 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి తీసుకోబోతున్నాం తెలియజేశారు. మహిళల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని, 2003 నుంచి ఈ బిల్లుకు అన్ని పక్షాల మద్దతు ఇస్తున్నాయని అన్నారు. కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉన్నామని, ప్రజా స్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మహిళల రిజర్వేషన్ల బిల్లు వస్తోందని, 2029 లోగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. ఈ నెల 16 నుంచి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతుందని మోడీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్రని, మహిళల భాగస్వామ్యంలో వ్యవస్థ బలోపేతమైందని కొనియాడారు. నారీ శక్తికి పంచాయత్ నుంచి పార్లమెంట్ కు వచ్చేందుకు వారి ప్రయాణం సులభతరం అవుతుందని, నారీ శక్తికి పంచాయత్ ఒక ఉదాహరణని మోడీ స్పష్టం చేశారు.