Reading Time: < 1 minute

సందేశాత్మక ప్రేమకథగా కాలగమనం ఏప్రిల్ 17న విడుదల

Caption of Image.

రాజా బిరుదుల, లావణ్య రామారావు జంటగా సుధాకర్ బుర్రి దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘కాలగమనం’. ఈనెల 17న  సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో  రాజా బిరుదుల మాట్లాడుతూ  ‘ఒక మంచి సందేశం ఉన్న ప్రేమ కథా చిత్రమిది.  యూత్‌‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌‌‌‌గా ఆకట్టుకుంటుంది’ అని అన్నాడు.

ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని లావణ్య చెప్పింది. దర్శక,నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ ‘మాకున్న బడ్జెట్‌‌లో  మంచి కథను తెరకెక్కించాం. కంటెంట్ బాగుంది, అందుకే విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం.  యువతను ఆకట్టుకునే అంశాలు ఉంటూనే పెద్దల్ని కూడా ఆలోచింపజేసే చిత్రమిది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.