Reading Time: < 1 minute

అమరావతి: గుంటూరు జిల్లా వరగాని గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న చిన్నారిని చూసుకోకుండా బస్సును డ్రైవర్ కదిలించడంతో బస్సు చక్రాల కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదం చూసిన బస్సు డ్రైవర్ భయంతో అక్కడినుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు రూప్ అన్వేష్ గా పోలీసులు గుర్తించారు.