
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది లక్నో. ఇప్పుడు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో గెలిచిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గత మ్యాచ్‌లోని జట్లనే కొనసాగిస్తుంది.
తుది జట్లు:
జిటి: సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఎల్‌ఎస్‌జి: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్‌రమ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), అయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.