Reading Time: < 1 minute

హైదరాబాద్: నేడు తెలంగాణ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు  ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని కొనియడారు. ఇంటర్ మొదటి ఏడాది 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 66.20 శాతం, ఇంటర్ మొదటి ఏడాది 74.40 శాతం బాలికలు, ఇంటర్ మొదటి ఏడాది 57.69 శాతం బాలురు, ఇంటర్ రెండో సంవత్సరం 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు..ఇంటర్ రెండో సంవత్సరం 70.58 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఇంటర్ రెండో ఏడాది 78.65 శాతం బాలికలు, ఇంటర్ రెండో ఏడాది 62.50 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. eenadu.net, eenadupratibha.net వెబ్ సైట్లలో ఇంటర్ ఫలితాలను తమ సెల్ ఫోన్ వాట్సప్ లో చూసుకునే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు నెలలోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తానంది. గత ఏడాదితో పోలీస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం 2025 మొదటి ఏడాది 66.91 శాతం, 2026 లో 66.94 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2026 లో ద్వితీయ సంవత్సరం 72.43 శాతం, 2026 లో 75.61 శాతం ఉత్తీర్ణత సాధించింది.