
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సమ్మర్ స్పెషల్‌గా మే 8న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఒక వైపు సుమంత్ ప్రభాస్, మరో వైపు జగపతి బాబు.. మధ్యలో నిధి ప్రదీప్ నిల్చున్న ఉండటం కథపై ఆసక్తిని పెంచుతోంది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నాడు.