
హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌ల వర్షం కురిసింది. ఎంఐపై ఆర్‌సిబి 18 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 29 సిక్స్‌లు బాదాయి. 36 ఫోర్లను బౌండరీకీ దాటించాయి. ఆర్‌సిబి జట్టు తొలుత 240 పరుగుల చేయగా ముంబయి జట్టు 222 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. రెండు జట్లు కలిసి 462 పరుగులు చేయగా 318 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పటిదార్ సిక్స్‌ల సునామీ సృష్టించాడు. మయాంక్ మర్కండే వేసిన 12 ఓవర్‌లో హాట్రిక్ సిక్స్‌లు కొట్టి రజత్ ఔరా అనిపించాడు. ముంబయి ఆల్‌రౌండర్ రూథర్‌పోర్డ్ 20 ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు.