బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో సోమవారం ధరలు ఒకేసారి కుప్పకూలాయి. ఈ వారం తొలిరోజే పసిడి ధరలు పతనమవ్వడం కొనుగోలు చేసేవారికి ఉపశమనంగా చెప్పవచ్చు. గత రెండు రోజులుగా ధరలు పెరగ్గా.. ఇవాళ శాంతించి ఊరట కలిగించాయి. ఈ తగ్గింపు అనంతరం సోమవారం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,460గా ఉండగా.. ఆదివారం రూ.1,52,840 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.380 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,39,750 వద్ద ఉండగా.. నిన్న రూ.1,40,100 వద్ద కొనసాగింది. నిన్నటితో పోలిస్తే రూ.350 తగ్గింది.
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే ఉన్నాయి. ఇక చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,380గా ఉండగా.. నిన్న రూ.1,53,820 వద్ద స్థిరపడింది. ఇవాళ రూ.440 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,600 వద్ద ట్రేడవుతోండగా.. ఆదివారం రూ.1,41,000గా ఉంది. నేడు రూ.400 తగ్గుముఖం పట్టింది.
అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,750 వద్ద కొనసాగుతోంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,610గా ఉండగా.. నిన్న రూ.1,52,990గా ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,39,900 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. నిన్న ఇది రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. అటు హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద ఉంది. నిన్న అది రూ.2.65 లక్షల వద్ద స్థిరపడింది




