Reading Time: 2 minutes
Kareena Kapoor Anushka Sharma Celebrities At Rcb Vs Mi Wankhede Ipl 2026

IPL 2026: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కేవలం క్రికెట్ అభిమానులకే కాకుండా, సినీ ప్రియులకు కూడా కనువిందు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సినీ తారల రాకతో గ్లామర్ అద్దినట్లయింది. ఒకవైపు మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, మరోవైపు స్టాండ్స్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.

READ ALSO: Kiran Abbavaram : మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.

ముంబై జెర్సీలో కరీనా కపూర్ ఫ్యామిలీ
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన కుటుంబంతో కలిసి స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జెహ్‌లతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. విశేషమేమిటంటే వీరందరూ ముంబై ఇండియన్స్ జెర్సీలు ధరించి తమ హోమ్ టీమ్‌కు గట్టిగా మద్దతు పలికారు. గ్యాలరీలో కరీనా, సైఫ్ తమ పిల్లలతో గడిపిన క్యూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ ధావన్ – పూజా హెగ్డే
యువ హీరో వరుణ్ ధావన్ కూడా స్టేడియంలో సందడి చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలిసి ఆయన మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న “హై జవానీ తో ఇష్క్ హోనా హై” చిత్రం త్వరలో విడుదల కానుంది. మొదట జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు మే 22కి ప్రీపోన్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి స్టేడియంలో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విరాట్ ఫిఫ్టీ.. అనుష్క ఫుల్ హ్యాపీ
మరోవైపు కింగ్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన భర్తకు మద్దతుగా స్టాండ్స్‌లో కూర్చుని కనిపించారు. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించడంతో అనుష్క ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ ఆడే ప్రతి షాట్‌కు ఆమె చప్పట్లతో ఉత్సాహపరుస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ స్టార్ కపుల్‌కి సంబంధించిన రొమాంటిక్ అండ్ ఎనర్జిటిక్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు క్రికెట్ ధమాకాను, ఇటు బాలీవుడ్ గ్లామర్‌ను సమపాళ్లలో పంచినట్లు అయ్యింది.

READ ALSO: Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!