
- స్కిల్సెంటర్లు, ఉద్యోగులకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు కసరత్తు
- కనెక్టివిటీ పెంచేలా ఎయిర్‌పోర్టును డెవలప్చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర సర్కారు ఫోకస్పెట్టింది. ఈ పార్క్లో సదుపాయాలు సరిగా లేకపోవడంతో పలు సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో వసతులు కల్పిస్తే పెట్టుబడులొచ్చి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావించింది.
టెక్స్‌టైల్‌పార్క్‌ను 1,327 ఎకరాల్లో ఏర్పాటు చేయగా.. ఇందులో ఇండస్ట్రియల్డెవలప్మెంట్ కోసం 866 ఎకరాలు కేటాయించారు. మరో 350 ఎకరాల్లో రోడ్లు, స్కిల్ సెంటర్లు, ఉద్యోగులకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, సోలార్ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలు, స్మార్ట్మానిటరింగ్వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇటీవల టీజీఐఐసీ రిక్వెస్ట్ఫర్ప్రపోజల్స్(ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానించింది. వచ్చే నెల 4 నాటికి సమర్పించాలని టెండర్నోటీసుల్లో పేర్కొంది.
- కనెక్టివిటీ సమస్య..
టెక్స్‌టైల్‌పార్క్‌కు ప్రధాన సమస్య కనెక్టివిటీ. ఉద్యోగులకు వసతి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఉద్యోగులు, సంస్థల ప్రతినిధులు టెక్స్టైల్పార్క్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో టెక్స్‌టైల్‌పార్క్‌లో స్టార్‌హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్సంస్థలను ఆహ్వానిస్తోంది. అటు ఉద్యోగులకు పార్క్‌లోనే వసతి కల్పించేలా క్వార్టర్లు నిర్మించాలని నిర్ణయించింది. మరోవైపు కనెక్టివిటీ సమస్యను తగ్గించేందుకూ చర్యలు తీసుకుంటోంది. ఎయిర్‌పోర్టు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులకు ట్రావెలింగ్సమస్యలొస్తున్నాయి.
దీంతో సంస్థలు ఈ టెక్స్‌టైల్‌పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం వరంగల్ టెక్స్‌టైల్‌పార్క్‌లో కిటెక్స్, యంగ్వన్, గణేశా ఎకోస్పియర్ వంటి సంస్థలున్నాయి. వాటి ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తోంది. 25 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.