Reading Time: 2 minutes
Ramu Rathod : లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. యూట్యూబ్‏లో సెన్సేషన్.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము రాథోడ్..

ఫోక్ సింగర్ రాము రాథోడ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేటి తరం జానపద కళాకారులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాము రాథోడ్. కేవలం గాయకుడిగానే కాకుండా, అద్భుతమైన డ్యాన్సర్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. రాము రాథోడ్ కెరీర్ మలుపు తిప్పిన పాట రాను బొంబాయికి రాను. ఈ సాంగ్ వరల్డ్ లెవల్లో దూసుకుపోయింది. ఇటీవల ఈపాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 800 మిలియన్ వ్యూస్ అందుకుని సంచలనం సృష్టించింది. ఈ పాటతో వచ్చిన ఫేమ్ తోనే అటు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ వరుస పల్లె పాటలతో యూట్యూబ్, సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

రాము రాథోడ్ పేరు వినగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన పాడిన ‘ఓ చిన్న రాములమ్మ’. ఈ పాట సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాట ద్వారా వచ్చిన గుర్తింపు ఆయన కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. మారుమూల ప్రాంతం నుండి వచ్చిన రాము, తనలోని ప్రతిభను నమ్ముకుని నేడు పెద్ద వేదికలపై రాణిస్తున్నారు. ఓ చిన్న రాములమ్మ సక్సెస్ తర్వాత తనకు తెలంగాణ రచయిత అందె శ్రీ స్వయంగా కాల్ చేసి ప్రశించారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

రాను బాంబాయికి రాను’ వంటి పాటలు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించడంతో, కేవలం యూట్యూబ్ యాడ్స్ ద్వారా కోటి వచ్చినట్లు సమాచారం. ఇక ఓ చిన్న రాములమ్మ పాటను కేవలం రూ.1 లక్షతో తెరకెక్కించగా.. దాదాపు 20 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాము రాథోడ్.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..



ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..