Reading Time: < 1 minute
Rcb Fans Name Baby Virat Kohli Fan Moment Ipl 2026

Virat Kohli Fan Craze Peaks: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అభిమానుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొందరికి విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్టు అంటే ఎనలేని అభిమానం. ఈ జట్టుకు గతేడాది వరకు ఒక్క కప్పు కూడా రాలేదు. అయినా అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గలేదు. ఇక ఎన్నో ఏళ్ల నిరీక్షణకు గతేడాది(2025)లో తెరపడింది. జట్టు మొదటి ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అయితే.. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ జంట తన అభిమానాన్ని ఏకంగా బిడ్డ నామకరణం వరకు తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.

READ MORE: Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

ప్రస్తుతం ఐపీఎల్ జోరు నడుస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో జరిగిన ఒక నేమింగ్ సెర్మనీ వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఎవరికి పేరు పెట్టాలన్న పండితులు, ఆస్ట్రాలజర్లు నిర్ణయిస్తుంటారు. కానీ, ఈ దంపతులు మాత్రం తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఉన్న ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు. వేదికపై పూలు, లైట్ల మధ్య తండ్రి ఒక క్రికెట్ జర్సీని చేతిలో పట్టుకోగా, తల్లి బాబును ఒళ్లో ఉంచుకుంది. ఆ జర్సీని విప్పి చూపించగానే దానిపై ‘విరాట్’ అనే పేరు కనిపించింది. ఇది చూసి అక్కడి వారంతా కేకలు, చప్పట్లతో సందడి చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇది కదా అసలైన ఫ్యాన్డమ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ ప్రయాణం ఆశాజనకంగానే సాగుతోంది. ఏప్రిల్ 12, 2026 నాటికి ఆర్‌సీబీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించి, ఒకటాంట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 4 పాయింట్లు, +1.231 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానంలో కొనసాగుతోంది.

READ MORE: RR vs RCB Controversy: ఈ సీజన్‌లోనే అతిపెద్ద వివాదం!! అడ్డంగా దొరికిన రాజస్థాన్ మేనేజర్.. పక్కనే వైభవ్..