Reading Time: < 1 minute

ఇరాన్‌తో ఎటువంటి సమన్వయం లేకుండా రెండు అమెరికా యుద్ధ నౌకలు శనివారం కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లాయి. హర్మూజ్‌ను రాకపోకలకు క్లియర్ చేస్తామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఈ దశలోనే ఈ జలమార్గాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అమెరికా యుద్ద నౌకలు దాటివేయడం కీలక అంశం అయింది. ఇరాన్‌తో యుద్దం ఆరంభం తరువాత ఈ జలసంధిని అమెరికా నౌకలు దాటడం ఇదే తొలిసారి అయింది. అమెరికా నౌకాదళ సారధ్య మిసైల్ విధ్వంసకాలు హర్మూజ్ దాటిన విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ అమెరికా అధికారుల నిర్థారణ మేరకు వెలువరించింది. హర్మూజ్‌లో సీ మైన్స్ తొలిగింపు ప్రక్రియను అమెరికానే స్వయంగా చేపడుతుందనే వార్తలు ఈ నౌకల కదలికలతో బలోపేతం అయ్యాయి.