Reading Time: < 1 minute

విద్యతోనే సమాజంలో గౌరవం: భీమ్ రాజ్ సేన సంఘం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

Caption of Image.

విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంత్రి సందర్భంగా  2026 ఏప్రిల్ 12న హైదరాబాద్ కుత్భుల్లాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేష్ ఖంబాలే నేతృత్వంలో ఏర్పాటు చేసిన భీమ్ రాజ్ సేన సంఘాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజలకు మహాత్మ జ్యోతిబాపూలే ఆదర్శనీయుడని కొనియాడారు. అగ్రవర్ణాల వారు మంచినీరు కూడా ఇవ్వని పరిస్థితిని గమనించి.. విద్య ద్వారానే  సమాజంలో గౌరవం  లభిస్తుందని విద్యావ్యాప్తికి కృషి చేశారని చెప్పారు. స్త్రీలకు కూడా విద్యాభ్యాసం తప్పనిసరి అని భావించి తన సహచరి  సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి తొలి ఉపాధ్యాయురాలుగా మలచారని తెలిపారు. 

►ALSO READ | గుడ్ న్యూస్: ఉప్పల్ స్టేడియం ముందు క్యూ లైన్లకు ఫుల్ స్టాప్.. ఇక నుంచి డిజిటల్ టికెట్ల ద్వారా అనుమతి

ఆ దంపతులు తన పర బేధం లేకుండా అందరికీ విద్యను అందించారని అన్నారు. సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా చట్టసభలలో ఉండడం అనేది ఫూలే పట్టుదల తోనే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష వేదాంతీ, చిన్న పైల్వాన్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.