Reading Time: < 1 minute
Director Vv Vinayak About Movie With Pawan Kalyan Viral Comments

టాలీవుడ్ మాస్ డైరెక్టర వి.వి. వినాయక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా కోసం మెగా అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘ఆది’, ‘ఠాగూర్’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన వినాయక్, పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అందరూ భావిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వినాయక్ ఈ కాంబినేషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : Asha Bhosle: ఆశా భోంస్లేతో తనకున్న అనుబంధంపై..మాస్ట్రో ఇళయరాజా ఎమోషనల్ వీడియో..

‘నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలని చాలా బలంగా అనుకున్నాను. దాని కోసం ఒక కథను కూడా అనుకుని, కొన్ని రోజుల పాటు ఆ ప్రాజెక్ట్‌పై వర్క్ చేశాను’ అని వినాయక్ వెల్లడించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో పట్టాలెక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆ సినిమా గనుక మెటీరియలైజ్ అయ్యి ఉంటే, అది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండటంతో.. భవిష్యత్తులో ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు పవన్ అభిమానులు.