Reading Time: 2 minutes
Gold And Silver Prices Fall Today Check Latest Gold Rate Per Tola

Gold and Silver Prices Fall: బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా తగ్గాయి. వారం మొదటి రోజు సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఈ రెండు విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కసారిగా కిలోకు రూ.6,000కుపైగా తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి వెండి ధర కిలోకు రూ.2,43,274 వద్ద ముగిసింది. అయితే, సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి ఫ్యూచర్స్ ధర రూ.2,37,190కు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే వెండి ధర కిలోకు రూ.6,084 మేర తగ్గింది. ఇక, జీవితకాల గరిష్ఠ స్థాయితో పోలిస్తే వెండి ధర భారీగా పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర చరిత్రలో తొలిసారిగా కిలోకు రూ.4,39,337 గరిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి వెండి ధర రూ.2,02,147 మేర తగ్గింది.

బంగారం ధర కూడా తగ్గుదల
వెండి లాగే బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది. గత శుక్రవారం జూన్ గడువు ఉన్న బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,652 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో అది రూ.1,51,457కు పడిపోయింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.1,195 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,457 వద్ద ఉంది. అంటే ఒక తులం బంగారం కొనాలనుకునే వారికి ఇది తాజా సూచిక ధరగా చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర 10 గ్రాములకు రూ.2,02,984 గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ స్థాయి నుంచి ఇప్పటి ధరతో పోలిస్తే రూ.51,527 మేర తగ్గింది. దీంతో గరిష్ఠ ధరలతో పోలిస్తే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది కొంత ఊరటనిచ్చే విషయం.

ఈ రోజు హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,246 గా ఉంది.. అంటే.. ఒక గ్రాముపై స్వల్పంగా 38 రూపాయలు.. 10 గ్రాములపై 380 రూపాయాలు తగ్గింది.. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.13,975 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.11,434 గా ఉంది.. ఇక, కిలో వెండి ధర రూ.5,000 తగ్గి.. రూ.2,60,000కు చేరింది..

యుద్ధ ఉద్రిక్తతల మధ్య ధరలు ఎందుకు పడుతున్నాయి?
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే పెట్టుబడిదారులు బంగారం, వెండిని సురక్షిత ఆస్తులుగా భావించి కొనుగోలు చేస్తారు. దీంతో ధరలు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ద్రవ్యోల్బణ భయాలు, అలాగే డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది.

కొనుగోలుదారులకు మంచి అవకాశం
ఇటీవల గరిష్ఠ ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గడంతో ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ధరల్లో ఇంకా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.