
Rohit Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఒక ఆందోళనకర దృశ్యం చోటుచేసుకుంది. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అర్ధాంతరంగా మైదానాన్ని వీడారు. అవుట్ కాకపోయినా ఆయన డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీల ముందు ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రోహిత్ గాయంపై ఆయన భార్య రితీకా సజ్దే స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మైదానంలో అసలేం జరిగింది?
వాంఖడే స్టేడియంలో ఆర్‌సీబీ నిర్దేశించిన 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 13 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించారు. అయితే ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో ఆయన హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో ఇబ్బంది పడటం కనిపించింది. పరుగు తీసే సమయంలో తీవ్రమైన నొప్పి రావడంతో, ఫిజియో సలహా మేరకు రోహిత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగారు. రోహిత్ కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న దృశ్యాలు అభిమానులను కలవరపెట్టాయి.
రితీకా సజ్దే భావోద్వేగం
రోహిత్ శర్మ నొప్పిని భరిస్తూ ఇబ్బంది పడుతున్న సమయంలో, కెమెరాలు స్టాండ్స్‌లో ఉన్న ఆయన భార్య రితీకా సజ్దే వైపు మళ్లాయి. తన భర్త పడుతున్న బాధను చూసి రితీకా చాలా ఆందోళన చెందారు. ఆమె ముఖంలో భయం, ఆవేదన స్పష్టంగా కనిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ ఏ మ్యాచ్ ఆడినా రితీకా స్టేడియంలో ఉండి ప్రోత్సహిస్తుంటారు, అలాంటిది ఆయన గాయపడటం ఆమెను తీవ్రంగా కలిచివేసింది.
Ritika bhabhi in tha stand to support Rohit Sharma.
pic.twitter.com/aLlePr6xpU
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 12, 2026
రోహిత్ అవుట్ అయినట్టేనా?
చాలా మంది అభిమానులకు రోహిత్ శర్మ అవుట్ అయ్యారా లేదా అనే సందేహం నెలకొంది. క్రికెట్ నిబంధనల ప్రకారం రిటైర్డ్ హర్ట్ అంటే క్రీజులో ఉన్న ఆటగాడు అనారోగ్యం లేదా గాయం కారణంగా తనంతట తానుగా మైదానాన్ని వీడటం. ఇలా వెళ్ళిన ఆటగాడు జట్టుకు అవసరమైతే, వికెట్లు పడిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని అవుట్ కింద పరిగణించరు. ఒకవేళ ఏ కారణం లేకుండా బ్యాటర్ వెనుదిరిగితే దానిని రిటైర్డ్ అవుట్ అంటారు, అప్పుడు మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వీలుండదు. కాబట్టి రోహిత్ కోలుకుంటే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
ROHIT SHARMA IS RETIRED HURT – Get well soon, Ro
pic.twitter.com/QjuElo6i7j
— Johns. (@CricCrazyJohns) April 12, 2026
భారీ స్కోరు.. ముంబై పోరాటం
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ వీరవిహారం చేయడంతో ఆ జట్టు 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. వాంఖడే చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కోరు. రోహిత్ శర్మ మైదానం వీడే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. రోహిత్ వంటి కీలక ఆటగాడు గాయపడటం ముంబై ఛేదనపై ప్రభావం చూపింది. ప్రస్తుతానికి రోహిత్ గాయం తీవ్రత ఎంత ఉందనేది టీమ్ మేనేజ్‌మెంట్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..