బంగినపల్లి మామిడి పండ్లు : వీటి రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. మామిడి పండ్ల అన్నింటిలోకెళ్లా దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ బంగిన పల్లి మామిడి పండ్లు అంటే ఇష్టం ఉంటుంది. ఇక ఇవి పెద్ద పరిమాణంలో, పసుపు వర్ణంలో చాలా తియ్యటి రుచితో ఉంటాయి. వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు.
ఆల్ఫోన్సో మామిడి పండ్లు : వీటిని ఎక్కువగా మహారాష్ట్రాలోని కొంకణ్ ప్రాంతంలో సాగు చేస్తారు. దీని సువాసన, రుచికి ఎవ్వరు అయినా ఫిదా అవ్వాల్సిందే. కాస్త చిన్నగా కనిపించే ఈ పండు లోపల చాలా జ్యూసీగా తియ్యగా ఉంటుంది. దీనిని తినడం వలన ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
కీసర్ మామిడి పండ్లు : కీసర్ మామిడి పండ్లు భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. వీటిని గుజరాత్లోని గిర్ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి పుసుపు రంగు మాత్రమే కాకుండా, కాస్త నారింజ రంగులో ఉంటాయి. వీటిని ఎక్కువగా స్వీట్ తయారికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి చాలా తీపిగా ఉంటాయి.
తోతాపురి మామిడి పండ్లు : ఏపీ, తమిళనాడులో ఎక్కువగా పండించే మామిడిపండ్లలో తోతాపురి మామిడి పండ్లు ఒక రకం. ఇవి కాస్త తీపిగా, కాస్త పులుపుగా ఉంటాయి. ఇవి తినడానికి, ఎక్కువగా ఊరగాయ పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
చౌసా మామిడి పండ్లు, పండ్లలో రాజు, కానీ ఈ మామిడి పండుచ, మామిడి పండ్లలో రాజు. ఇవి మంచి రుచి, సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉత్తర భారత దేశంలో, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, హర్యానా, హిమా చల్ ప్రదేశ్లో పండిస్తారు. ఇవి చాలా జ్యూసీగా తియ్యగా ఉంటాయి. చాలా మంది ఇష్టపడే మామిడి పండ్లలో ఇవి కూడా ఒక రకం.




