Reading Time: < 1 minute
Jananayagan Leaked Online A Big Advantage For Thalapathy Tvk Vijay Political Career

విజయ్ దళపతి చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జననాయగన్ మూవీ విషషయంలో వరుస షాక్స్ తగులుతున్నాయి. జనవరి9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ ఇష్యూకి గురైంది. కోర్టు కేసులు, అప్పీళ్లు, ఉపసంహరణ ఇలా త్రీ మంత్స్ గడిచిపోయాయి. మరో వైపు ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యిందని టాక్. డిస్ట్రిబ్యూటర్స్ కూడా తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేయాలని పేచీలు పెట్టుకున్నారు. చివరకు మూవీ రీసెన్సార్‌కు వెళ్లింది. ప్రాబ్లమ్ సాల్వ్.. త్వరలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటోన్న తరుణంలో మూవీ మొత్తం ఆన్ లైన్‌లో లీకైంది.

Also Read : 2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్

జననాయగన్ మొత్తం సినిమా లీక్ కావడంతో షాకైంది మూవీ టీం. వీడియోను షేర్ చేయద్దంటూ హెచ్ వినోద్ ఎమోషనల్ నోట్ పంచుకోగా.. వీడియో షేర్ చేసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కెవిన్ ప్రొడక్షన్ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. జననాయగన్ కోసం కెవిఎన్ ప్రొడక్షన్ భారీగా ఖర్చు పెట్టింది. రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. హీరో విజయ్ ఏకంగా రూ. 220 కోట్లు తీసుకున్నాడని టాక్. అయితే ఈ వీడియో ఎడిట్ రూం నుండే లీకైందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ లీక్‌కు మూవీ టీం కారణమని అంటున్నారు. ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అని విజయే వీడియో లీక్ చేయించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జననాయగన్ లీక్ వల్ల విజయ్ కన్నా నిర్మాత ఎక్కువ నష్టపోయాడు. అయితే ఈ లీక్  విజయ్ పొలిటికల్ మైలీజ్ తెచ్చిపెట్టిందని టాక్. ఇటీవల త్రిష వ్యవహారంతో విజయ్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే జననాయగన్ లీక్ వ్యవహారంతో త్రిష విషయం సైడ్ అయి విజయ్ కు సింపతీ వచ్చింది. మొత్తానికి జననాయగన్ విజయ్ కు ఒకింత మేలుచేసిందని తమిళనాడు పొలిటికల్ వర్గాలలో చెప్పుకుంటున్నారు.