
రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది విద్యాశాఖ. టెట్ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్ కావడంతో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే… తక్కువ సమయం ఉన్న క్రమంలో అభ్యర్ధులు అప్రమత్తమై త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు.
టెట్ పరీక్షకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జూన్ నెలలో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక, హాటల్ టికెట్ల జారీ వంటి ఇతర సాంకేతిక అంశాలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అబ్యర్ధులు సిలబస్ చూసుకొని పరీక్షకు సిద్ధమవ్వాలని సహించరు అధికారులు.
టెట్ పరీక్షకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అధికారులు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తు గడువు నిర్ణయించారు.
ఫీజు ఇలా:
ఒక్క పేపర్ కు అయితే:
- బీసీ/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 750
- ఎస్సీ/ఎస్టీ/PH అభ్యర్థులకు: రూ. 700
రెండు పేపర్లకు అయితే:
- బీసీ/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000,
- ఎస్సీ/ఎస్టీ/PH అభ్యర్థులకు రూ.950 చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షల షెడ్యూల్:
జూన్ 15 నుంచి 30 మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
జూన్ 9 నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అర్హత:
- జనరల్/ EWS: 60 శాతం,
- బీసీ అబ్యర్ధులు : 50 శతం,
- ఎస్సీ/ఎస్టీ/PH అభ్యర్థులు: 40 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
ఫలితాలు జులై 28 నుంచి 31 మధ్య విడుదల చేసే అవకాశం ఉంది. schooledu.telangana.gov.in లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచింది విద్యా శాఖ
►ALSO RAED | GSDP ఫార్ములా ప్రకారం.. డీలిమిటేషన్ జరిగితే.. తెలంగాణలో కొత్తగా పెరిగే ఎంపీ సీట్లు ఎన్నంటే..