Reading Time: < 1 minute
Ai Technology In Tamil Nadu Election Campaign Vijays Holographic Strategy Goes Viral

AI Technology in Tamil Nadu Election Campaign: టెక్నాలజీలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి.. ఎన్నికల ప్రచారానికి కాదేది అనర్హం అనే రీతిలో నేతలు టెక్నాలజీని వాడేస్తూ ఔరా..! అనిపిస్తున్నారు.. తమిళనాడు ఎన్నికల రాజకీయం ఇప్పుడు టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రచారంలో ఏఐ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కోసం అభ్యర్థులు వాడుతున్న సాంకేతికత చర్చనీయాంశంగా మారింది. ​విజయ్ తన సినిమాలతో ఎంత పాపులరో, రాజకీయాల్లోనూ అంతే దూకుడుగా ఉన్నారు. అయితే, సమయాభావం వల్ల ఆయన అన్ని నియోజకవర్గాలకు స్వయంగా వెళ్లడం సాధ్యం కావడం లేదు. దీన్ని అధిగమించేందుకు టీవీకే అభ్యర్థులు ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ అనే అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు.

Read Also: Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్

ఈ టెక్నాలజీ ద్వారా విజయ్ నేరుగా అక్కడికి వచ్చి ఓటర్లతో మాట్లాడుతున్నట్లే కనిపిస్తుంది. ​తాజాగా కుంభకోణంలో ఈ పద్ధతిలో నిర్వహించిన ప్రచారం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టేజ్ మీద విజయ్ ప్రత్యక్షంగా ఉన్నట్లు ఉండటంతో జనం భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ యుగంలో ప్రచార శైలి ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.. కానీ, అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి.. కాగా, మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. మే 4వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు..