Reading Time: < 1 minute

ఈవీఎంలలో మార్పులకు బీజేపీ కుట్ర: సీఎం మమత బెనర్జీ

Caption of Image.

పశ్చిమ మేదినీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బెంగాల్​సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల పేర్లను తొలగించడమే కాకుండా, ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈవీఎంలలో మార్పులకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ దుర్వినియోగం చేస్తూ.. తనపై తప్పుడు కేసులు పెట్టి, భవానీపూర్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‎ను చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించిందన్నారు. 

పశ్చిమ మేదినీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి సుమారు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను బీజేపీ బలవంతంగా తొలగించిందని పేర్కొన్నారు. బీజేపీ కుట్రలను టీఎంసీ కార్యకర్తలు, బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.