Reading Time: < 1 minute

ములుగు: కోతుల కోసం విషం కలిపిన బాలామృతం తిని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గోవిందరావుపేటలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పెట్టే బాలామృతంలో కోతులను చంపేందుకు పంచాయతీ సిబ్బంది విషం కలిపారు. నర్సరీ ప్రాంతంలో విషం కలిపిన బాలామృతం పెట్టడంతో అశ్విన్ నందన్ అనే నాలుగేళ్ల బాలుడు తెలియక అది తిన్నాడు. వెంటనే బాలుడు స్పృహతప్పి పడిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.