Reading Time: < 1 minute

ఇరాన్: గల్ఫ్ ఓడరేవు అయితే అందరికీ..లేకుంటే ఎవరికీ కావు అని ఇరాన్ తెలిపింది. గల్ఫ్ ఓడరేవులు అందరికీ చెందుతాయని, అందరికీ చెందకుంటే..ఎవరికీ లేకుండా పోతాయని అంది. గల్ఫ్ ఓడరేవుల యాజమాన్యంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి రాకపోకల నియంత్రణకు శాశ్వత యంత్రాంగమని, అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు సరికాదని సూచించింది. అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్యని, అమెరికా వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉందని విమర్శించింది. తమ పోర్టులకు ముప్పు వాటిల్లితే.. ఏ దేశపు పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది.