Reading Time: < 1 minute

పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాలగమనం‘. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. హైదరాబాద్ లో ‘కాలగమనం‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజా బిరుదుల “ఒక మంచి సందేశం ఉన్న ప్రేమ కథా చిత్రమిది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది”అని అన్నారు. దర్శక, నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ “యువతను ఆకట్టుకునే అంశాలు ఉంటూనే పెద్దల్ని కూడా ఆలోచింపజేచేసే చిత్రమిది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య రామారావు, రాజేష్ రాజ్ తేలు, జబర్దస్త్ రాజమౌళి, బోలే షావలి పాల్గొన్నారు.