Reading Time: < 1 minute

ముంబయి:  ఐపిఎల్ లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్-  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ(50), టిమ్ డేవిడ్(34), జితేశ్ శర్మ(10), రోమారియో షెపర్డ్(2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, శార్థూల్ టాకూర్, మిచెల్ శాంట్నార్, హార్ధిక్ పాండ్యా తలో ఒక వికెట్ తీశారు.