
కాంగ్రెస్ ఎంపీ శాశి థరూర్ పాకిస్తాన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ఇస్లామాబాద్‌లో హోస్ట్ చేస్తున్నందుకు ఆయన ఎద్దేవా చేశారు. “పాకిస్తాన్ అమెరికాతో ఆడుతున్న ఆ రకమైన పాత్రను వారే పోషించగలరు” అని థరూర్ సార్కాస్టిక్‌గా అన్నారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇటీవల ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టారు. పశ్చిమ ఆసియా సంఘర్షణలో రెండు వారాలు డిప్లొమసీకి అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు.
Also Read:Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!
ఆ పోస్ట్ ఎడిట్ హిస్టరీలో “Draft — Pakistan’s PM Message” అని రాసి ఉండటం వైరల్ అయింది. దీనిపై థరూర్ స్పందించారు.”వాషింగ్టన్ నుంచి ఆ సందేశాన్ని పాక్ ప్రధానికి ఇచ్చి పోస్ట్ చేయమని చెప్పారని అనుమానాలు ఉన్నాయి. మనం భారత్ ప్రధాన మంత్రి కోసం ఏదైనా రాస్తే, ‘Draft for India’s PM’ అని ఎవరు రాస్తారు? ఆ భాష, ఫ్రేజెస్ కూడా ట్రంప్ ఉపయోగించినట్లు ఉన్నాయి. అమెరికాతో పాకిస్తాన్ ఆడుతున్న ఆ రకమైన ఆటను వారే ఆడగలరు” అని థరూర్ అన్నారు. అయితే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పూర్తిగా తిరస్కరించకూడదని కూడా థరూర్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో పాకిస్తాన్‌కు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది, అక్కడ షియా జనాభా ఎక్కువగా ఉంది.
Also Read:US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..
యుద్ధం తీవ్రమైతే మొదటి రఫ్యూజీల వేవ్‌ను పాకిస్తాన్‌నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారికి “skin in the game” (స్వంత ప్రమేయం) ఉందన్నారు. భారత్ ఈ చర్చల్లో కేంద్ర భూమిక పోషించలేకపోవడం “కొంచెం ఇబ్బందికరం” అని థరూర్ అభిప్రాయపడ్డారు. అయినా, ఎవరు మధ్యవర్తిత్వం చేసినా శాంతి కలగడం భారత్ జాతీయ హితం కోసం మంచిదేనని, దాన్ని సమర్థించాలని చెప్పారు. భారత్ తన స్వంత శాంతి, భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు యుఎస్-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో వచ్చాయి. టర్కీ, ఈజిప్ట్‌తో పాటు పాకిస్తాన్ కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది.