Reading Time: < 1 minute

కేసు టేకప్ చేయాలా.. డబ్బు, మందు బాటిళ్లు పంపించు.. మీర్పేట్ ఎస్సై నిర్వాకం

Caption of Image.

కేసు పరిష్కారం కావాలా వద్దా..? అయితే ముందు మందు బాటిళ్లు పంపించు.. ఆ తర్వాత డబ్బు అరేంజ్ చెయ్.. ఇవి ఆ ఎస్సై బాధితులతో ఆడే బేరసారాలు. డిమాండ్ చేసినంత ఇవ్వకుంటే కేసును నీరుగార్చడం, ఆలస్యం చేయడం.. అవసరమైతే ఫిర్యాదు చేసినవాళ్లనే ఇబ్బందులకు గురిచేయడం రండారెడ్డి జిల్లా మీర్పేట్ ఎస్సై స్పెషల్. విసుగు చెందిన బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సస్సెన్షన్ కు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

మీర్ పేట్ పరిధిలోని లెనిన్ నగర్ లో తన స్థలాన్ని కబ్జా చేశారని తిరుపతయ్య  అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్సై నాగభూషణం బాధితునికి న్యాయం చేయకపోగా.. తననే డబ్బులు డిమాండ్ చేస్తూ మద్యం బాటిల్ పంపించాలంటూ వేధించాడు. మీర్పేట్ సీఐ శంకర్ నాయక్ బాటలోనే ఎస్సైలు నడుస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. 

►ALSO READ | పదవుల కోసం పార్టీ మారుతరా? : కాంగ్రెస్ నేత చనగాని దయాకర్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై నాగభూషణంపై అధికారులు చర్యలు చేపట్టారు. V. C. సజ్జనార్  ఆదేశాల మేరకు ఎస్సై నాగభూషణాన్ని ఆదివారం (2026 ఏప్రిల్ 12) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు శంషాబాద్ డీసీపీ రాజేష్ కు రెండు రోజుల గడువు విధిస్తూ, సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత ఎస్సైపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.