Reading Time: < 1 minute

 ఒకవైపు ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బొల్లా లక్షంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 10మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గత 24 గంటల్లో లెబనాన్‌లోని 200పైగా హెజ్‌బొల్లా ప్రాంతాలను లక్షంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు లెబనాన్ ప్రకటించింది. బీరుట్, కారకాస్‌లలో ఇజ్రాయెల్ గత బుధవారంనాడు జరిపిన దాడుల్లో భారీ భవంతులు ధ్వంస మయ్యాయి. శిథిలాలను తొలగించడంతో పాటు బాధితులను గుర్తించేందుకు లెబనాన్ పౌర రక్షణ విభాగం రంగంలోకి దిగింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కారకాస్‌లోని ఓ భవంతిలో కనీసం 100మంది సజీవ సమాధి అయినట్లు గుర్తించారు.